
టీం ఇండియా అనుకున్నది సాధిచింది. భారతీయులంతా గర్వపడేలా.. సొంత గడ్డపై ప్రపంచకప్‌ను దక్కించుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్స్‌లో గెలిచి మూడోసారి టి-20 ప్రపంచప్‌ను అందుకుంది. భారత్-శ్రీలంక వేదికలుగా జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగిన సూర్యకుమార్ సేన.. ఆరంభంలో కాస్త తడబడినా.. ఆ తర్వాత పుంజుకుంది. అన్ని విభాగాల్లో రాణిస్తూ.. చివరకు కప్పును సొంతం చేసకుంది.
ఈ విషయంపై సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ షాన్ పొలాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను, ముఖ్యంగా ఇంత స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్న టీమిండియాపై ఏ జట్టైనా గెలవడం అసాధ్యమని అన్నాడు. మిగితా జట్ల కంటే టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉందని పేర్కన్నొడు. టీం ఇండియా బ్యాటర్లను ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించారు. టీం ఇండియా టాప్ నుంచి బాటమ్ వరకు ఎనిమిది వరకు బ్యాట్స్‌మెన్లు 200 స్ట్రైక్‌రేటుతో ఆడుతున్నారని.. ఇలాంటి బ్యాటింగ్‌ను ఎదురుకోవడం ఎవరి వల్ల కాదు అని పేర్కొన్నాడు.
ఇది చాలదు అన్నట్టుగా ఇంకా టీం ఇండియాలోకి కొత్త ఆటగాళ్లు, భీకర హిట్టర్లతో టీం ఇండియాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. దేశవాళీలో అలాగే ఐపిఎల్‌లో దుమ్మురేపుతున్న వైభవ్ టీం ఇండియాలో చేరితే మాత్రం, బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారుతుంది. దీంతో ప్రత్యర్థి జట్లు భారత బ్యాటింగ్‌ను ఎదురుకోవాలంటే భయపడతాయని పొలాక్ పేర్కొన్నాడు.