Reading Time: < 1 minute

ఢాకా: బంగ్లాదేశ్‌లో రోజురోజుకీ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. కోమిల్లా ప్రాంతంలో శనివారం రోజున పూజ చేసుకుంటున్న హిందూ బృందంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. పూజూ కార్యక్రమానికి హాజరైన పలువురు ఈ ఘటనలో గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాధీ హత్యతో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగాయి. అప్పటి నుంచి దేశంలోని హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయారు.