
టాలీవుడ్‌లో ఈ మధ్య పెళ్లిళ్ల ట్రెండ్ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితమే విజయ్ దేవరకొండ, రష్మికలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రీసెంట్‌గా అల్లు శిరీష్ కూడా తన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పి.. ఓ ఇంటివాడయ్యాడు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో హీరో కూడా చేరిపోయాడు. త్వరలోనే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.
శ్రీనివాస్‌కు కాబోయే భార్య పేరు కావ్య. హైదరాబాద్‌కు చెందిన ఆమెకు సినీ పరిశ్రమతో సంబంధం లేదు. కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడైన సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శ్రీను’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అతడు ‘రాక్షసుడు’, ‘కిష్కిందపురి వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ సినిమాల్లో నటిస్తున్నాడు.