Reading Time: < 1 minute

అహ్మదాబాద్: టి-20 ప్రపంచకప్ 2026లో అసలైన మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. గ్రూప్ స్టేజ్, సూపర్-8, సెమీ ఫైనల్స్‌ని దాటుకొని ఫైనల్స్‌కి చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తొలిసారి ట్రోఫీ అందుకోవాలని న్యూజిలాండ్ భావిస్తుంటే. ఈసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకొని మూడుసార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న జట్టుగా రికార్డు సృష్టించాలని భారత్ పట్టుదలతో ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఒక మార్పు చేసింది. మెక్‌కోంచీ స్థానంలో జాకబ్ డఫీని జట్టులోకి తీసుకుంది. భారత సెమీస్‌లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతుంది.

తుది జట్లు:

న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ.

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.