
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ట్యాబ్లెట్స్ వాడుతారు. కానీ వాటిని తీసుకునే క్రమంలో చేసే కొన్ని తప్పుల కారణంగా ఒక్కోసారి ఆరోగ్యాన్ని మరింత పాడుచేసుకుంటారు. మనం అనారోగ్యాన్ని కాపాడుకోవడానికి మందులు తీసుకోవడం ఎంత ముఖ్యలో వాటిని సరైన విధానంలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఆ తప్పులు ఏంటో చూద్దాం.
మందులు తీసుకునేటప్పుడు ఈ తప్పులను చేయకండి
- సర్టిఫైడ్ డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోవద్దు
- ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించి మాత్రమే ట్యాబ్లెట్స్ వాడండి.
- చిన్న సమస్యే కదా అని మీరే నేరుగా మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చి వాడకండి
- ముఖ్యంగా పిల్లలకు మందులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి వారి శరీరంపై దుష్ప్రభావాలు చూపవచ్చు
- కొంతమంది ఆరోగ్యం కాస్త బెటర్ అవ్వగానే మందులు తీసుకోవడం మానేస్తారు, దీనివల్ల ఇన్ఫెక్షన్ పూర్తిగా నయం కాకముందే మళ్లీ తీవ్రమయ్యే అవకాశం ఉంది.
- మందులను వైద్యులు సూచించిన కరెక్ట్ సమయానికి తీసుకోండి.
- గడువు ముగిసిన మందులను ఎప్పుడూ వాడకండి.. కొనే ముందు ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయండి. .
ట్యాబ్లెట్స్ వాడేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మనం ఏదైనా ఆరోగ్య సమస్యకు మందులు వాడుతూ ఉంటే.. పూర్తిగా నయం అయ్యే వరకు వాటిని మధ్యలో ఆపేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా మధ్యలో ఆపేసినా లేదా సరిగ్గా తీసుకోకపోయినా, ఆ సమస్య మళ్లీ పెరిగి దీర్ఘకాలికంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. మందును తప్పుగా లేదా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, గుండెకు తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చని చెబుతున్నారు.
యాంటీబయాటిక్స్ మందులను వాడేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.. తప్పుడు సమయంలో వాడడం వల్ల బ్యాక్టీరియా ఆ మందులకు నిరోధకతను పెంచుతుందని.. దీనివల్ల భవిష్యత్తులో వ్యాధికి చికిత్స చేయడం మరింత కష్టమవుతుందని చెబుతున్నారు. బీపీ లేదా కొలెస్ట్రాల్ మందులను సరిగ్గా తీసుకోకపోతే గుండెపోటు లేదా పక్షవాతం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
పెయిన్ కిల్లర్ మందులు వాడుతూ ఉంటే.. వాటిని మోతాదుకు మించి ఎప్పుడూ తీసుకోకండి. ఇలా చేయడం వల్ల మూత్రపిండాలు, కాలేయంపై తీవ్రమైన ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా మందులను అలవాటు చేయడం వల్ల మనకు అవసరం అయినప్పుడు అవి పనిచేయవని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.