
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదానాకి కారణమైంది. రోడ్డు విస్తరణలో గుంతలు తీసి వదలడంతో బొలెరోర వాహనం నడిరోడ్డుపై బోల్తా పడింది.ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే..
కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేట్ కోకాకోలా కంపెనీ దగ్గర ఆదివారం (ఆగస్టు2) సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మిని ఎక్స్ కావేటర్ లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం నడిరోడ్డుపూ గుంతలో పడి బోల్తా పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డు విస్తరణలో భాగంగా గుంతలు తీసి వదిలివేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కమ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు.
►ALSO READ | అయ్యో పాప.. ఏంటీ ఘోరం.. చెరువులో ముంచి.. 9నెలల చిన్నారిని చంపిన కన్నతల్లి