
మాస్, క్లాస్ అనే తేడా లేకుండా సబ్జెక్ట్ బాగుంటే చాలు అనుకొని సినిమాలు చేయడంలో యువ హీరో విశ్వక్‌సేన్. 2025లో ‘లైలా’ అనే విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను పలకరించాడు విశ్వక్. ఈ సినిమా మీధ ఎన్నోఆశలు పెట్టుకున్న విశ్వక్‌కు నిరాశే మిగిల్చింది. అయితే ఈ ఏడాది ‘ఫంకీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత నెల విడుదలైన ఈ సినిమా కామెడీ ఇష్టపడే వారికి తెగ నచ్చేసింది. కాగా, ఈ సినిమా త్వరలో ఒటిటిలో సందడి చేయనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నరేశ్, విటివి గణేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.