Reading Time: < 1 minute

అమరావతి: వరుడు తాళి కడుతున్న సమయంలో పెళ్లి మండపానికి ప్రియుడు రావడంతో వధువు అతడి చేతిలో చేయి వేసి తన లవర్ అని చెప్పడంతో వివాహం ఆగిపోయింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టిఆర్ జిల్లా మైలవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  యువతి, యువకుడికి పెళ్లి ఘనంగా జరుగుతుండగా బంధువులు, స్నేహితులు అందరూ హాజరయ్యారు. అదే సమయంలో పెళ్లి మండపంలోకి ప్రియుడు వచ్చాడు. ప్రియుడిని చూసిన వెంటనే మండపం నుంచి పరుగులు తీసిన లవర్ ను వధువు కౌగలించుకుంది. అనంతరం తన గ్రామానికి చెందిన అబ్బాయని, గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకున్నామని చెప్పింది. జీలకర్ర, బెల్లం పెట్టాక తాళి కట్టే సమయంలో వధువు, ప్రియుడి పక్కన నిలబడడంతో కుటుంబ సభ్యులు, అతిథులు ఆశ్చర్యపోయారు. ప్రియుడిపై వధువు తరపు బంధువులు దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వధువు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో వివాహం ఆగిపోయింది. తన ప్రియుడిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని వధువు పోలీసులను అడగడం కొసమెరుపు.