
చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది కలిసి భారీ పాన్- ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్ పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం శర్వా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలలో ఒకటిగా రూపొందుతోంది. శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో శర్వా పూర్తిగా మాసీ, ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి గ్రాండ్ పాన్- ఇండియా రిలీజ్ కానుంది.
హుషారైన ‘జిద్ధి జిద్ధి..’ చార్మింగ్ స్టార్ శర్వా స్పోర్ట్ డ్రామా బైకర్ ఏప్రిల్ ౩న థియేటర్లలో విడుదల కానుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి మోటోక్రాస్ మూవీ. హై-ఆక్టేన్ రేసింగ్ యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న కథ ఇది. శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ జిద్ధి జిద్ధి అనే సరికొత్త ట్రాక్‌ను రిలీజ్ చేశారు. జిబ్రాన్ స్వరపరిచి పాడిన ఈ పాటను షెన్‌బగరాజ్, అరవింద్ శ్రీనివాస్, సుదర్శన్ రామ్ కూడా పాడారు. కృష్ణకాంత్ రాసిన ఈ సాహిత్యం లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన పట్టుదల, ధైర్యం, నిరంతర ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తోంది. పాటలోని మాంజ్‌లో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటోక్రాస్ రేసర్‌గా మారే ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారు.