
ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి గ్రూప్ బ్యానర్‌పై నిర్మాత కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్లా’ చిత్ర ప్రారంభ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ వేడుకకు సీమన్, లతా రజినీకాంత్, ఆర్.బి. చౌదరి, బాలా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, నటులు, టెక్నీషియన్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్ మాట్లాడుతూ “మా చిత్ర ప్రయాణానికి ఇది మంచి ప్రారంభం. నాపై, నా టీంపై నమ్మకం ఉంచిన నిర్మాత కన్నన్ రవికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి మేమంతా పూర్తి నిబద్ధతతో పని చేస్తాము”అని అన్నారు.