
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ విద్యాధరపురంలో దారుణం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ల చిన్నారిపై స్కూల్ టీచర్ యాసిడ్ పోసింది. అనంతరం బాత్‌రూంలో బాలిక పడిపోయిందని తల్లికి టీచర్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. టీచర్ తనపై యాసిడి పోసిందని బాలిక చెప్పింది. దీంతో టీచర్ పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఖర్చులు చెల్లించి నేషనల్ స్కూల్ యాజమాన్యం తప్పుకుంది. రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు.