
తల్లీ మరణించిన విషయాన్ని దాచి, ఆమె పేరుతో బ్యాంక్‌లో డిపాజిట్ అవుతున్న పింఛన్ డబ్బులను కాజేస్తేన్న కుమార్తె పై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని జగద్గిరిగుట్టకు చెందిన కలమ్మ భర్త ఎస్‌పిడిసిఎల్‌లో పనిచేసి మృతి చెందాడు. భర్త పింఛన్ భార్య అయిన కలమ్మకు వస్తోంది, నెల నెలా డబ్బులు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అవుతున్నాయి. ఇటీవల కలమ్మ కూడా మృతిచెందడంతో ఆమె కుమార్తె రేణుక విషయం దాచి, కలమ్మ బ్యాంక్ ఖాతా నుంచి రూ.6.45లక్షలు విత్ డ్రా చేసింది. ఈ విషయం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లింది. సూపరింటెండింగ్ ఇంజీనీర్ మధురానగర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు రేణుకపై కేసు నమోదు చేశారు. వెంటనే విత్‌డ్రా చేసిన డబ్బులు తిరిగి విద్యుత్ సంస్థకు చెల్లించాలని రేణుకను హెచ్చరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ ఇన్స్‌స్పెక్టర్ ప్రభాకర్ తెలిపారు.