Reading Time: < 1 minute

మధ్యప్రాచ్య యుద్ధం, అంతర్జాతీయ చమురు కటకట నేపథ్యంలోనే భారతదేశానికి రష్యా నుంచి 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు చేరుకోనుంది. రష్యానుంచి ఇప్పటి పరిస్థితుల్లో ఆయిల్ తీసుకోవచ్చునని అమెరికా 30 రోజుల సడలింపు ఇచ్చింది. ఈ క్రమంలోనే అరేబియా సముద్రం మీదుగా అతి కొద్దిరోజుల్లోనే చమురు బ్యారెల్స్ భారత తీరానికి చేరుకోనున్నాయని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. చాలాకాలంగా భారత్‌కు పంపించేందుకు సిద్ధంగా ఉంచిన రష్యా చమురు ఇప్పటి ఆంక్షల సడలింపుల దశలో వెంటనే అక్కడి నుంచి బయలుదేరాయి. అంతర్జాతీయ నౌకారవాణా వెబ్‌సైట్ల సమాచారం మేరకు భారతదేశ తీరంలోకి చేరిన చమురు నౌకలు సాధ్యమైనంత తొందరగా

నిర్ణీత భారత రేవుల వద్దకు చేరుకుంటుంది. భారతదేశ చమురు తక్షణ అవసరాలను తీర్చేందుకే కాకుండా, భవిష్య అవసరాలకు కూడా సాధ్యమైనన్ని నిల్వలు భద్రం చేసుకోవాలనే ఆలోచనతో రష్యా ఇతరత్రా మార్గాల నుంచి క్రూడాయిల్ తెప్పించుకునేందుకు భారతదేశం పలు విధాలుగా దౌత్య సమున్నత స్థాయిల్లో వేగంగా చర్యలకు దిగింది. భారత్‌కు భారీ స్థాయిలో చమురు తీసుకువచ్చే నౌకలు ఇప్పటికే సింగపూర్ సమీపంలో సముద్ర జలాల్లో ఆగి ఉన్నాయని వెల్లడైంది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం సముద్ర జలాల్లో భారత్ పోర్టుల్లోకి చేరుకునేందుకు రష్యా క్రూడాయిల్ నౌకలు రంగం సిద్ధం అయింది.