Reading Time: < 1 minute

భువనేశ్వర్: గల్లంతైన సుఖోయ్ యుద్ధ విమానం ఆచూకీ దొరికింది. ఒడిశా రాష్ట్రం జోర్హాట్‌లోని కర్బి ఆంగ్లాండ్ కొండల్లో కూలినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. సుఖోయ్-30 ఎంకెఐ అనే యుద్ధ విమానం గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలు దేరిన కాసేటికే రాడర్‌తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే నేఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. జోర్హాట్ కు 60 కిలో మీటర్ల దూరంలో కర్బి ఆంగ్లాండ్ కొండ ప్రాంతంలో కూలిపోయినట్టుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు స్క్రాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్లు మృతిచెందారు. ఇద్దరు మృతికి ఐఎఎఫ్ సంతాపం తెలిపింది. ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోవడంపై రక్షణ శాఖ రాజ్ నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారు దేశాని చేసిన సేవ ఎల్లప్పుడూ భారతీయులు గుర్తించుకుంటారన్నారు.