
భోపాల్: హోళీ వేడుకలు జరుపుకొని తన అక్క వాళ్ల ఇంటికి వెళ్తుండగా బాలుడిపై ఓ వ్యక్తి సుత్తెతో దాడి చేసి అనంతరం రక్తం తాగి, మాంసం తిన్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం దామో జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దెహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమన్న గ్రామంలో భరత్ విశ్వకర్మ తన సోదరుడు విజయ్ విశ్వకర్మతో కలిసి హోళీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి తన సోదరి ఇంటికి వెళ్తున్నారు. గుడ్డ పటేల్ అనే వ్యక్తి సుత్తె తీసుకొని భరత్ తలపై వెనుక నుంచి కొట్టాడు. భరత తల పగిలి కిందిపోయాడు. వెంటనే నిందితుడు పటేల్ తల నుంచి వస్తున్న రక్తాన్ని తాగడంతో పాటు మాంసాన్ని కూడా తిన్నాడు. స్థానికులు స్పందించి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. స్థానికులను రాళ్లతో కొట్టి నిందితుడు చేనులోకి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. మృతుడు అర్థకేధా గ్రామానికి చెందిన బాలుడిగా గుర్తించారు. గుడ్డ పటేల్ భార్యను చంపిన కేసులో అతడు జైలు జీవితం గడిపాడని పోలీసులు తెలిపారు. మరో హత్యలో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మానసిక వ్యాధితో నిందితుడు ఇబ్బంది పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.