
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి యుద్ధానికి దిగాయి. ఇరాన్‌పై రెండు దేశాలు దారుణంగా వైమానికి దాడులు చేస్తున్నాయి. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 200 మంది చిన్నారులు మృతి చెందారని యునిసెఫ్ తెలిపింది. ఇరాన్ 181 మంది, లెబనాన్ ఏడుగురు, ఇజ్రాయెల్ ముగ్గురు, కువైట్‌లో ఒకరు మృతి చెందాడు. అభం శుభం తెలియని పిల్లలు యుద్ధాన్ని ప్రారంభించలేదని, మూల్యం మాత్రం చెల్లిస్తున్నారు. ఇరాన్‌లోని మినాబ్‌లో బాలికల పాఠశాలపై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేయడంతో 160 మందిపైగా బాలికలు ప్రాణాలు కోల్పోయారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ పేర్కొంది. ఈ దాడి అమెరికా దళాలు చేసినట్టు ఆరోపణలు చేసింది. గత ఏడు రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో దాదాపుగా 1230 మంది చనిపోయి ఉంటారు. ఫిబ్రవరి 28 నుంచి పది దేశాలలో 11 వేల విమానాల రాకపోకలను నిలిపివేశారు.