
తిరుమల: బిగ్‌బాస్ కంటెస్టెంట్లు తనూజ, దివ్వెల మాధురి వివాదంలో ఇరుక్కున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ తనూజ పుట్టిన రోజు వేడుకలు టిటిడి అతిథి గృహంలో నిర్వహించారు. కేక్‌ను తిరుమలకు తీసుకెళ్లడం కట్ చేయడం అనేది టిటిడి నిబంధనలకు విరుద్ధం. ఎంఎల్‌సి దువ్వాడ శ్రీనివాస్, మాధురి అనే దంపతులతో కలిసి తనూజ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని శ్రీవిభవ అతిథిగృహాన్ని వారు అద్దెకు తీసుకున్నారు. తనూజతో మాధురి కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారాన్ని టిటిడి అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో దువ్వాడ దంపతులు శ్రీవారి ఆలయం ఎదుట ఫొటోషూట్ చేయడం అనేది వివాదాస్పదంగా మారిన విషయం విధితమే.