Reading Time: < 1 minute

హైదరాబాద్: మరో అవినీతి అధికారి ఎసిబి వలలో చిక్కారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి ఆడిట్ అధికారి సంతోష్ పట్టుబడ్డారు. రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి పింఛన్ ప్రాసెస్ చేసేందుకు సంతోష్ రూ.40 వేల లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.