
ఆరు రోజులుగా మధ్యప్రాచ్యం పోరులో 1230 మంది ఇరానీయన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ సంస్థ గురువారం తెలిపింది. పలు ప్రాంతాలో అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల క్రమంలో పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. మృతుల సంఖ్యను ఎప్పటికప్పుడు ఇరాన్ ఫౌండేషన్ ఒకటి తెలియచేస్తోంది.