Reading Time: < 1 minute

కొండగట్టు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి.. అర్చకులు, అధికారులకు కీలక సూచనలు.. 

Caption of Image.

విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొండగట్టు ఈవో రమాదేవి తెలిపారు. మూడు రోజుల క్రితం వేములవాడ ఈఓగా పనిచేస్తున్న రమాదేవికి కొండగట్టు ఫుల్ చార్జి ఈఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి బుధవారం కొండగట్టుకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం అంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ వీఐపీ భక్తులైన సామాన్య భక్తులైన ఒకే విధంగా చూడాలని అర్చకులకు, అధికారులకు సూచించారు. 

గత ఈవో తీసుకున్న నిర్ణయాలు యధావిధంగా  అమలు చేస్తామని తెలిపారు. త్వరలో టెంపుల్ లో ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తామన్నారు. భక్తులు సమర్పించే గోల్డ్ సిల్వర్ కు రసీదులు అందజేస్తామన్నారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగుల వివరాలు సేకరించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి ఆలయంలో ఉన్న వసతులను సమస్యలను తెలుసుకున్నారు. వీరి వెంట ఏఈఓ హరిహరనాథ్ తదితరులు ఉన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.