Reading Time: < 1 minute

హైదరాబాద్ లో జనవరి 3న ఈ ఏరియాల్లో మంచినీళ్లు బంద్

Caption of Image.

 హైదరాబాద్ లోని  పలుచోట్ల మంచినీటి సరఫరాకి అంతరాయం కల్గనుంది.  జనవరి 3 ఉదయం 10 గంటల నుంచి జనవరి 4 తెల్లవారుజామున 4 గంటల వరకు మొత్తం 18 గంటల పాటు తాగునీళ్ల సరఫరా నిలిచిపోనుందని జలమండలి ప్రకటించింది.  సింగూరు ప్రాజెక్ట్ ఫేజ్–3 మెయిన్ పైప్‌ లైన్‌ కి భారీ లీకేజీలు ఏర్పడినందున  1600 ఎంఎం డయా పైప్‌ లైన్‌ కి అత్యవసర మరమ్మత్తులు చేపడుతున్నారు. పెద్దపూర్–సింగపూర్ మధ్య పనులు చేపట్టన్నారు అధికారులు. 

ఈ క్రమంలో  జనవరి 3న ఉదయం 10 గంటల నుంచి మాదాపూర్, కొండాపూర్, బాలానగర్, మూసాపేట, కేపిహెచ్‌బీ, ఫతేనగర్‌, మియాపూర్, హఫీజ్‌ పేట్, ప్రగతినగర్, బీహెచ్ఈఎల్, చందానగర్, హెచ్ సీయూ ప్రాంతాలకు 18 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.  దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని వినియోగదారులకు జలమండలి విజ్ఞప్తి చేసింది. 

©️ VIL Media Pvt Ltd.