Reading Time: < 1 minute
The Raja Saab Pre Release Event Is Tomorrow But The Venue Has Been Changed

ప్రభాస్ హీరోగా  మారుతి డైరెక్ట్ చేసిన సినిమా రాజాసాబ్  జనవరి 9న విడుదల కానుంది. . ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Also Read : Tollywood : గ్యాప్ తీసుకుని వరుస సినిమాలతో వస్తున్న లక్కీ హీరోయిన్

రెబల్ స్టార్ ప్రభాస్ హాజరుకాబోతున్న ఈ ఈవెంట్ ను డిసెంబర్ 27న భారీ ఎత్తున చేస్తున్నారు. అయితే మొదట ఈ ఈవెంట్ ను ఎల్బీ స్టేడియం లో చేయాలనుకున్నారు. కానీ అనుమతులు రాకపోవడంతో రామోజీ ఫిలిం సిటీలో  నిర్వయించాలని ప్లాన్ చేసారు. అయితే అక్కడ కూడా కాదని ఈవెంట్ ను సిటీలోని కైతలపూర్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నారు. అయితే ఇక ఈ ఈవెంట్‌లో మరొక ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. గతంలో వచ్చిన ట్రైలర్‌లో డార్లింగ్ వింటేజ్ వైబ్‌తో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ సినిమా పై మరింత అంచనాలు పెంచేలా కట్ చేస్తున్నట్టుగా టాక్. ఇక్కడితో సినిమా హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేలా మారుతి ప్లాన్ చేస్తున్నాడు.