Reading Time: < 1 minute

హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అన్నారు. దానం నాగేందర్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామని, తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని తెలియజేశారు. జిహెచ్ఎంసిలో కాంగ్రెస్, ఎంఐఎం మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయని, గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రచారం చేస్తానని అన్నారు. జిహెచ్ఎంసి అంతటా తిరిగి కాంగ్రెస్ పథకాలను వివరిస్తానని, జిహెచ్ఎంసి విస్తరణతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని దానం నాగేందర్ పేర్కొన్నారు.