
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా, తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) . ఈ సినిమాను గురువారం ( జూన్ 25, 2026) గ్రాండ్ గా ప్రారంభించారు. దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వంలో పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగానే.. సోషల్ మీడియాలో ఒక రేంజ్ డిబేట్ మొదలైంది. సినిమా కంటెంట్ పక్కన పెడితే.. అసలు ఈ ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ ఏంటి సామీ? అంటూ నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు.
‘ఇడుపు కాయితం’ అంటే ఏంటి?
ఇది పక్కా తెలంగాణ గ్రామీణ మాండలిక పదం.సింపుల్‌గా చెప్పాలంటే.. ‘విడాకుల పత్రం’ (Divorce Document) అర్థం. ఇప్పుడంటే దంపతులు విడిపోవాలంటే కోర్టులు, లాయర్లు చుట్టూ తిరుగుతున్నారు కానీ.. పూర్వకాలంలో భార్యాభర్తలు కలిసి బతకలేము అనుకున్నప్పుడు ఊరి పెద్దల సమక్షంలో ఒక ఒప్పంద పత్రం రాసుకునేవారు. ఇడుపు, ఇడుసు అంటే వదిలిపెట్టడం అని అర్థం. అలా ఒకరినొకరు విడిచిపెట్టేటప్పుడు రాసుకునే అగ్రిమెంటే ఈ ‘ఇడుపు కాయితం’.
ఇడుపు కాయితం || Idupu Kaytham
The story of our Lives ♥️@SukumarWritings @TheBunnyVas #ThabithaSukumar #VamsiDondapati pic.twitter.com/VAmbQOLuPZ
— Priyadarshi Pulikonda (@Preyadarshe) June 25, 2026
రీజనల్ వార్..
ఈ టైటిల్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య పాత సోషల్ వార్ మళ్లీ రాజుకుంది. దీనికి ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా?, ఆంధ్రా వాళ్లం మాకు అర్థం కావట్లేదు, థియేటర్లలో సబ్‌టైటిల్స్ వేయండి ప్లీజ్! అంటూ కొందరు ఆంధ్రా నెటిజన్లు ఎక్స్‌లో సెటైర్లు వేశారు.
ఒకనాడు “మా విడాకులు”
ఇప్పుడు… “ఇడుపుకాయితం”
రెండింటి అర్థం ఒక్కటే..
కానీ..
“ఇడుపుకాయితం”
పదం ఇనంగానే ఇది మన సినిమా..
మన ఊరి ముచ్చట..
మన ఊర్లె శింతల కింద నడిశిన మొగుడు పెండ్లాల పంచాది ముచ్చట లెక్కనే అనిపిస్తున్నది.ఎవ్వలేమనుకున్నా..
మన మాటల ఉన్నంత అఫెక్షన్..… pic.twitter.com/vsfI8aG61e— Prabhakar Venavanka (@Prabhavenavanka) June 25, 2026
దీనికి తెలంగాణ నెటిజన్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గతంలో సినిమాల్లో ఆంధ్రా మాండలికాలైన గోదారి యాస, రాయలసీమ సీమ పల్లాలు వాడినప్పుడు తామెప్పుడూ డబ్బింగ్ అడగలేదని.. ఇప్పుడు ఒక తెలంగాణ పదం వాడగానే ఇంతలా ట్రోల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ద్వేషం కాదు బ్రదర్.. ఇరు ప్రాంతాల సంస్కృతులను గౌరవించడం నేర్చుకోవాలి అంటూ మైత్రేయ అనే నెటిజన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
పొద్దున ‘ఇడుపు కాయితం’ టైటిల్ రిలీజ్ కాగానే ఇగ ఏడుపులు స్టార్ట్ చేస్తరని ఒక గ్రూప్‌లో అన్నాను.. అన్నట్టే కొందరు ఏడుపులు మొదలుపెట్టిన్రు.
ఇక్కడ సమస్య ఒక పదం అర్థమవ్వడం, కాకపోవడం కాదు.. ఇక్కడ సమస్యల్లా ఆధిపత్య ధోరణి, అహంభావం.
గ్రామీణ నేపథ్యం లేని చాలామంది తెలంగాణ వాళ్ళకి కూడా… pic.twitter.com/0o6GU4iwju
— Mythreya (@Mythreyaa) June 25, 2026
ఈచిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌసెస్ సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా.. ‘ఇడుపు కాయితం’ టైటిల్ చుట్టూ జరుగుతున్న ఈ వివాదం మాత్రం సినిమాకి విపరీతమైన పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది. మరి ఈ విడాకుల పత్రం వెనుక దర్శకుడు ఎలాంటి ఎమోషనల్ అండ్ క్రేజీ కథను దాచాడో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..