Reading Time: 2 minutes

వంట చేయడం, ఇల్లు ఊడవడం..ఆడవాళ్ల పని కాదు.. బద్ధకస్తులకు ప్రియాంకా చోప్రా చురకలు!

Caption of Image.

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కాదు.. హాలీవుడ్ లోనూ తన నటనతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసింది. ప్రస్తుతం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో నటిస్తుంది.  అయితే లేటెస్ట్ గా ఈ బ్యూటీ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంట్లో పనుల దగ్గర నుంచి సినీ ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్ వరకు  ఈ అమ్మడు ఇచ్చిన పవర్ ఫుల్ స్టేట్మెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

అది ఆడవాళ్ల పని కాదు..

ఇంట్లో వంట చేయడం, ఇల్లు ఊడవడం, సామాన్లు కడగడం.. ఇవన్నీ కేవలం ఆడవాళ్ల బాధ్యత మాత్రమే అనే పాతకాలపు మైండ్‌సెట్‌పై ప్రియాంకా గట్టిగానే సెటైర్ వేశారు. ఇవి కేవలం ఆడవాళ్ల పనులు కావు. అవి ఈ సమాజంలో బ్రతకడానికి కావాల్సిన కనీస నైపుణ్యాలు. జెండర్‌ని చూపిస్తూ మీ బద్ధకాన్ని దాచుకోకండి అంటూ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చేసింది. ఈ ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా మహిళలు కరెక్ట్ గా చెప్పారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

టెక్నాలజీ పవర్

 ఒకప్పుడు సినిమా తీయాలంటే పెద్ద పెద్ద స్టూడియోలు, గాడ్ ఫాదర్స్ కావాలనే రూల్ ఉండేదని, కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఆ గ్యాప్ తగ్గిపోయిందంటూ ప్రియాంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎవరికైనా ఒక క్రేజీ ఐడియా వస్తే.. దాన్ని షూట్ చేసి, యూట్యూబ్‌లో పెడితే చాలు.. అది గ్లోబల్ లెవెల్‌లో సంచలనం సృష్టిస్తుందని చెప్పారు. ఇటీవల హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సూపర్ నేచురల్ హారర్ మూవీ ‘అబ్సెషన్’ (Obsession) ను ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా కోట్ చేశారు. ఎంటర్‌టైనర్‌గా ఉండటానికి ఇంతకంటే మంచి టైమ్ ఇంకొకటి ఉండదు అంటూ నయా క్రియేటర్స్‌లో జోష్ నింపారు.

వరుస సినిమాలతో ప్రియాంకా..

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ప్రియాంకా చోప్రా. డైరెక్టర్ S.S. రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’ లో ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషిస్తుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.  ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. 

మరో వైపు లార్డ్ ఆఫ్ ది రింగ్స్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫేమ్ ఓర్లాండో బ్లూమ్ (Orlando Bloom) తో కలిసి ప్రియాంక ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేయబోతున్నారు.. అటు హాలీవుడ్ టాప్ స్టార్ ఏంజెలీనా జోలీతో ప్రియాంకా చోప్రా చేతులు కలపబోతున్నట్లు తెలిపారు. కానీ ఇక్కడే ఒక చిన్న సస్పెన్స్ పెట్టారు. ఇది ఒక సినిమానా? ఏదైనా ఇంటర్నేషనల్ బ్రాండ్ కమర్షియల్ యాడ్స్ నా? లేక ఏదైనా సామాజిక సేవా కార్యక్రమమా (Philanthropic Initiative)? అనేది మాత్రం సీక్రెట్‌గా ఉంచారు. 

©️ VIL Media Pvt Ltd.