
బాలీవుడ్ ప్రముఖ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్ పరస్పరం మద్దతునిచ్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. తమ జీవిత భాగస్వాముల విజయాలను పంచుకోవడంలో వీరిద్దరూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆల్ఫా సినిమా ప్రమోషన్స్ సందర్భంగా రణబీర్ కపూర్ చేసిన ఒక చిన్న పని ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.గతంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆలియా ఆ సినిమా థీమ్ టీషర్ట్ ధరించగా, అప్పట్లో ఆమె తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇప్పుడు అదే భార్య సినిమాకు రణబీర్ కపూర్ మై వైఫ్ ఈజ్ యాన్ ఆల్ఫా అని రాసి ఉన్న ప్రత్యేక బ్లాక్ టీషర్ట్ ధరించి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్యూట్ గెస్చర్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇది ఆలియాకు గతంలో జరిగిన ట్రోలింగ్‌కు రణబీర్ ఇచ్చిన కౌంటర్‌గా భావిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న మొట్టమొదటి ఫీమేల్ స్పై థ్రిల్లర్ అయిన ఆల్ఫా చిత్రంలో శర్వరీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వీడియోల కోసం :