Reading Time: < 1 minute

అంగన్వాడీలో ఏంటీ ఘోరం..? పసి బిడ్డను కాలితో తన్నింది.. ఇలాంటోళ్లను ఏం చేద్దాం..?

Caption of Image.

ప్రీ స్కూల్స్కు పంపించే స్థోమత లేక నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు చిన్నారులను ప్రభుత్వ అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్పిస్తుంటాయి. కానీ.. అంగన్ వాడీ కేంద్రాల్లో ఆయాలు పిల్లలను ఎలా చూసుకుంటారోననే ఆందోళన మాత్రం తల్లిదండ్రుల్లో ఉంటూనే ఉంటుంది. ఈ భయాలను నిజం చేస్తూ ఒక అంగన్వాడీ సెంటర్లో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని నేవీ ముంబైలో ఉన్న పన్వేల్ తాలూకాలోని నందగావ్ అనే గ్రామంలో దారుణం జరిగింది. ఒక అంగన్వాడీ వర్కర్ మానవత్వం మరిచింది. చిన్న పాప అనే కనీస కనికరం లేకుండా చిన్నారిని కాలితో తన్నింది. అంత దారుణంగా తన్నడంతో ఆ పాప మెట్లపై నుంచి కింద పడింది. ఈ అంగన్వాడీ వర్కర్ అమానవీయ చర్యను సమీపంలో ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అన్నెంపున్నెం తెలియని ఒక పసి బిడ్డను తన్నిన ఆ కాలు పడిపోవాలని నెటిజన్లు శాపనార్థాలు పెట్టారు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఇంకెన్ని దారుణాలకు పాల్పడి ఉంటుందోనని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. మరో మహిళ వచ్చి ఆమెను అడ్డుకున్నప్పటికీ.. నవ్వుతూ ఉండటం ఆమెలోని శాడిజానికి కూడా అద్దం పట్టింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.