Reading Time: < 1 minute

సిద్దిపేట వెటర్నరీ కాలేజీని ..కొడంగల్ కు ఎత్తుకుపోవడం దుర్మార్గం

Caption of Image.
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కీములు కాకుండా స్కాములు జరుగుతున్నయ్ : హరీశ్ రావు

సిద్దిపేట/సిద్దిపేట టౌన్, వెలుగు : సిద్దిపేట అభివృద్ధిని చూసి ఓర్వలేకే శిల్పారామం, రంగనాయక సాగర్ వంటి పనులను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గురువారం సిద్దిపేటలోని 29వ వార్డులో వార్డు ఆఫీస్ ను ప్రారంభించి మాట్లాడారు.

 సిద్దిపేటకు తీసుకొచ్చిన వెటర్నరీ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్‌‌‌‌కు ఎత్తుకుపోయిండని మండిపడ్డారు. రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి 31 నెలలుగా మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో ఒక్కో వృద్ధుడికి రూ. 62 వేలు బాకీ పడ్డారన్నారు. 

కాంగ్రెస్ వచ్చాక కొత్త స్కీములు ఏమీ రాలేదు గానీ… స్కాములు మాత్రం జరిగాయని ఎద్దవా చేశారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రెండున్నరేండ్లలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. 

‘సర్’లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

‘సర్’ కార్యక్రమంలో బీఆర్ ఎస్ ముందుండాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. సర్ కార్యక్రమంపై గురువారం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

డోర్ టు డోర్ వెళ్లి ఓటు నమోదు చేసే కార్యక్రమం జరుగుతున్నందున పార్టీ శ్రేణులు ప్రజలకు సహాయసహకారాలు అందించాలని చెప్పారు. బూత్ లెవల్ ఏజెంట్స్ క్రియాశీలంగా పని చేయాలని, ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సర్ కార్యక్రమంపై క్యాంప్ ఆఫీస్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.