Reading Time: 2 minutes

Vijay Deverakonda: ఐదు కారవాన్లు.. భారీగా అసిస్టెంట్లు? అసలు ‘రణబాలి’ షూటింగ్‌లో అసలేం జరిగింది?

Caption of Image.

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే, గత రెండు రోజులుగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్  తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

అసలు రూమర్ ఏంటి?

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ షూటింగ్ సమయంలో నిర్మాతల బడ్జెట్‌కు తూట్లు పొడిచేలా ప్రవర్తిస్తున్నాడంటూ రూమర్స్ వస్తున్నాయి. విజయ్ తన పర్సనల్ యూజ్ కోసం ఏకంగా ఐదు కారవాన్లు డిమాండ్ చేశాడని, తన వెంట డజన్ల కొద్దీ అసిస్టెంట్లను ఉంచుకుంటూ నిర్మాతలకు అదనపు భారం కలిగిస్తున్నాడని నెట్టింట కొందరు ప్రచారం లేపారు. ఈ రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మేకర్స్ సీరియస్ వార్నింగ్..

ఈ ఫేక్ న్యూస్‌పై మైత్రి మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి గట్టిగా స్పందించారు. అవన్నీ పచ్చి అబద్ధాలు. విజయ్‌తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయనెప్పుడూ వర్క్ మీదే ఫోకస్ పెడతారు. ఆయన క్రమశిక్షణ, నిబద్ధత మాకు తెలుసు అంటూ రూమర్లకు గట్టి చెక్ పెట్టారు. అటు విజయ్ పీఆర్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఉద్దేశపూర్వకంగా హీరో ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఇలాంటి ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

►ALSO READ | Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఎక్కువ’.. మహిళా ఫ్యాన్ ఓపెన్ ఆఫర్.. క్రేజీ రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్!

బ్రిటిష్ కాలం నాటి కథ..

ఈ’రణబాలి’ సినిమా 1854 నుండి 1878 మధ్య కాలంలో, బ్రిటిష్ పాలన నాటి రాయలసీమ నేపథ్యంలో జరిగే పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతోంది. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తయింది. రాయలసీమలోని కొన్ని చారిత్రక కట్టడాలు, పాత కోటల్లో కీలక సన్నివేశాలను ఎంతో రిచ్‌గా తెరకెక్కించారు. విజయ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో వస్తున్న ఈ విజువల్ వండర్‌ను సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.