Reading Time: < 1 minute

 సనత్ నగర్  కల్ట్ ఫిట్ జిమ్‌లో కామాంధులు..మహిళా పైలట్ కు వేధింపులు..మేనేజర్, ట్రైనర్ అరెస్ట్

Caption of Image.

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని కల్ట్ ఫిట్ జిమ్‌లో దారుణం వెలుగుచూసింది. ఫిట్‌నెస్ ట్రైనింగ్ పేరుతో మహిళలపై జరుగుతున్న వేధింపుల పర్వం కలకలం రేపుతోంది. ఒక మహిళా పైలట్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణ ఉదంతం బయటపడింది.

జిమ్ ట్రైనింగ్ పేరుతో  మహిళా పైలట్‌ను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు ఫిట్‌నెస్ మేనేజర్ సంతోష్. అంతటితో ఆగకుండా… ఒక రాత్రి తనతో గడపాలంటూ సంతోష్ ఆమెపై తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు… తన గర్ల్‌ఫ్రెండ్ రజినీతో కలిసి సంతోష్ ఆమె ముందు అసభ్యకర ప్రతిపాదనలు పెట్టినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.ఆ అసభ్యకర ప్రతిపాదనలను మహిళా పైలట్ తీవ్రంగా నిరాకరించడంతో… సంతోష్  ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమెకు అసభ్యకర మెసేజ్ లు  పంపుతూ వేధింపులకు గురిచేశాడు. సంతోష్ చేస్తున్న ఈ ఆగడాలన్నింటికీ మరో ట్రైనర్ హరీష్ కూడా వత్తాసు పలికాడు.

బాధితురాలి ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సనత్‌నగర్ పోలీసులు… ఫిట్‌నెస్ మేనేజర్ సంతోష్‌తో పాటు, అతనికి సహకరించిన ట్రైనర్ హరీష్‌ను కూడా అరెస్ట్ చేశారు.

అయితే ఈ జిమ్‌లో వేధింపులకు గురైంది కేవలం ఆ ఒక్క మహిళా పైలట్ మాత్రమే కాదు… ఇదే జిమ్‌లో మరో నలుగురు మహిళలు కూడా వీరి చేతిలో వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది.  మహిళలకు రక్షణగా నిలవాల్సిన జిమ్ నిర్వాహకులు ఇలా కామాంధుల్లా మారడం  కలకలం రేపుతోంది. 

©️ VIL Media Pvt Ltd.