Reading Time: 2 minutes
IND vs Kohli : విరాట్ కోహ్లీ విషయంలో గౌతమ్ గంభీర్ రూట్ మార్చాలా? ఆర్సీబీ మోడల్ ఫాలో అవ్వాల్సిందేనా ?

IND vs Kohli : సౌతాఫ్రికా వేదికగా జరగబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనే విషయంపై భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కానీ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వరల్డ్ కప్‌కు ఇంకా కేవలం ఏడాది సమయం మాత్రమే ఉంది. కోహ్లీ కచ్చితంగా జట్టులో ఉంటాడని అందరూ భావిస్తున్నప్పటికీ, బీసీసీఐ, దాగుడుమూతల ధోరణి అభిమానుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ బోల్డ్ కామెంట్స్

టీమ్ మేనేజ్‌మెంట్ తన పట్ల చూపిస్తున్న నాన్-కమిట్టల్ అప్రోచ్‌పై విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్ 2026 సమయంలో పరోక్షంగా స్పందించాడు. “నేను నా ప్రాక్టీస్ విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటాను. ఒకవేళ నన్ను ఇంకా నా విలువను నిరూపించుకోవాలని ఒత్తిడి చేసే ప్రదేశంలో నేను ఉండాలనుకోవడం లేదు. అలాంటి ఆలోచనలు నా మైండ్ లో లేవు” అంటూ కోహ్లీ ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో ఓపెన్ గా చెప్పేశాడు. మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా సెలక్టర్లు కోహ్లీ స్థానంపై వెంటనే క్లారిటీ ఇచ్చి అతడిని ప్రశాంతంగా ఆడనివ్వాలని డిమాండ్ చేశాడు.

గంభీర్‌కు దినేష్ కార్తీక్ అదిరిపోయే సలహా

ఈ ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మెంటర్, బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్.. గంభీర్ అండ్ కోకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. “కోహ్లీ ఎంతో కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు, మ్యాచ్ ఎలా గెలిపించాలో అతనికి బాగా తెలుసు. అతనికి మనం ఇవ్వాల్సింది అల్లా గౌరవం, అతనికంటూ కొంత స్పేస్ ఇవ్వాలి. అతని ప్రాసెస్ లో మనం అస్సలు జోక్యం చేసుకోకూడదు. అతను మైఖేల్ జోర్డాన్, నోవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్ లాంటి బిగ్ లీగ్ ప్లేయర్. అతనికి వెన్నుదన్నుగా నిలిస్తే చాలు మైదానంలో అద్భుతాలు సృష్టిస్తాడు” అని కార్తీక్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ లో ఆర్సీబీ సంచలన సక్సెస్ ఫార్ములా

దినేష్ కార్తీక్ ఈ మాటలు చెప్పడానికి బలమైన కారణం ఉంది. ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో వరుసగా టైటిల్స్ గెలిచి ఆర్సీబీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయాల్లో కోహ్లీ పాత్ర అమోఘం. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా నాలుగు సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 2025లో కప్పు గెలిచినప్పుడు కోహ్లీ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోగా, 2026లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ జట్టును విజేతగా నిలిపాడు.

గతంలో గౌతమ్ గంభీర్ ఐపీఎల్ ఆడేటప్పుడు ఆర్సీబీని తన అత్యంత ఇష్టమైన ప్రత్యర్థిగా భావించేవాడు. మైదానంలో కోహ్లీతో గంభీర్ పలుమార్లు ఘర్షణకు దిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు గంభీర్ భారత క్రికెట్ కు హెడ్ కోచ్ గా అత్యున్నత స్థానంలో కూర్చున్నాడు. కాబట్టి పాత గొడవలను పక్కన పెట్టి, ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కోహ్లీని ఎలాగైతే గౌరవిస్తూ ఫ్రీడమ్ ఇచ్చిందో.. అదే సక్సెస్ మంత్రాన్ని గంభీర్ కూడా టీమిండియాలో ఫాలో అయితే 2027 వరల్డ్ కప్ కొట్టడం భారత్‌కు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..