
బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటే ఇంట్లోనో, ఏ రెస్టారెంట్ లోనో చేసుకుంటాం.. అదీ కుదరక పోతే చివరికి ఓ బైక్ పై చిన్న కేక్ పెట్టి క్యాండిల్ ఊది పుట్టిన రోజు చేసుకుంటారు.. కానీ ఓవ్యక్తి తన రూటే సపరేటు అని చాలా ఛండాలంగా మురికి కాల్వలో జరుపుకున్నాడు. టూమచ్ రా రేయ్.. మురికి కాల్వలో బర్త్ డే సెలబ్రేషన్స్ ఏంటి రాబాబూ అని నెటిజన్లు, చూసినోళ్లంతా బూతులు తిట్టుకునేలా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ అసహ్యమైన మురికి కాల్వ బర్త్ డే కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బర్త్ డే జరుపుకున్న తీరు చూస్తే కొంత ఇబ్బందిగా అనిపించినా.. దాని వెనక పెద్ద కథే ఉంది. దీనిగురించే నెటిజన్లలో పెద్ద చర్చకు దారి తీసింది.
అది యూపీలో ఆగ్రాలోని ఓ వార్డు..దానికి బీజేపీ నేత కౌన్సిలర్.. పేరు కిషన్ నాయక్.. తన వార్డులోని ఓ మురుగు కాల్వలో నిలబడి పుట్టిన రోజు జరుపుకున్నారు. మురుగు కాల్వ మధ్య లో ఓ టేబుల్ వేసి, కాలనీ వాసులంతా హాజరు కాగా.. మురుగు నీటిలోకి దిగి మరీకేక్ కట్ చేసి తినిపిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. ఇదంతా చూసేవారికి అసహ్యంగా అనిపించినా తప్పేం లేదు అన్నట్లు ఆ కౌన్సిలర్ తన పుట్టిన రోజులు వేడుకలు జరుపుకున్నాడు. అయితే ఆ కౌన్సిలర్ కు మురుగు కాల్వ బర్త్ డే సెలబ్రేషన్స్ వెనక అతని ఆవేదన, ఆందోళన, నిరసనలు ఉన్నాయి.
ALSO READ : అల్లాటప్పా సీఎంను అనుకున్నారా..!
తన వార్డులో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని, చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ వినూత్న నిరసన దారి ఎంచుకున్నాడు. అధికారుల నిర్లక్ష్యంతో గతంలో మురుగు కాల్వ కారణంగా రోగాలబారిన పడి కొందరు, వర్షాల కారణంగా కొందరు చనిపోయారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాబోయే వానకాలం కూడా పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
Kishan Nayak, a BJP councillor in Agra could be seen celebrating his birthday in a sewer. Local standing in knee deep sewer gathered around the table as Nayak cut cake. He claims municipal corporation officials dodge his open sewer and sanitation complaints. pic.twitter.com/W6TFqxov7u
— Piyush Rai (@Benarasiyaa) June 26, 2026