Reading Time: < 1 minute

బర్త్ డేకు పిలిస్తే.. లైంగిక దాడికి పాల్పడ్డాడు: పోలీసులకు యువతి ఫిర్యాదు

Caption of Image.

బంజారాహిల్స్, వెలుగు: సహోద్యోగిని బర్త్ డేకు పిలిస్తే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ యువతి బంజారాహిల్స్​పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌‌కు వచ్చిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అదే సంస్థలో పని చేస్తున్న అభినయ్ తో పరిచయం ఏర్పడింది. గత ఫిబ్రవరి 19న పుట్టినరోజు వేడుకలకు సహోద్యోగులు అభినయ్, వంశీని తన నివాసానికి ఆహ్వానించింది. వేడుకలు ముగిసిన తర్వాత ఆ ఇద్దరూ అక్కడే నిద్రించారు.

రాత్రి అభినయ్ ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 21న మరోసారి ఆమె నివాసానికి వెళ్లి, శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చాడు. 22, 23వ తేదీల్లో పదేపదే ఫోన్ కాల్స్, మెసేజ్‌‌ల ద్వారా మానసికంగా వేధించాడు. మరో సహోద్యోగితో కలిసి ఇంటికి వచ్చి తలుపులు తట్టడం, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించాడని గురువారం ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.