Reading Time: < 1 minute

తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ..సీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్

Caption of Image.

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల భారీ బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది.ఈ బదిలీల్లో భాగంగా.. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ నియామకమయ్యారు. అలాగే, ఎండోమెంట్స్ శాఖ నుంచి శైలజా రామయ్యర్‌ను బదిలీ చేసి, ఈఎఫ్‌ఎస్ అండ్ టీ శాఖ బాధ్యతలను అప్పగించారు. పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా పోస్టింగ్ పొందారు.

 ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా అజిత్ రెడ్డి నియామకమవ్వగా.. టీజీఆర్‌ఈడీసీఓ (TGREDCO) వీసీ అండ్ ఎండీగా ముషర్రఫ్ అలీ ఫారూఖీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ స్పెషల్ సీఎస్‌గా పి. కాత్యాయిని దేవి బాధ్యతలు చేపట్టనున్నారు. టీజీఆర్‌ఈఆర్‌ఏ (TGRERA) ఈడీగా ఉన్న కె. గంగాధర్‌ను ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేశారు.

ఇక జీడబ్ల్యూఎంసీ (GWMC) కమిషనర్‌గా టి. వెంకన్న, టూరిజం డైరెక్టర్‌గా కె. విద్యాసాగర్ నియమితులయ్యారు. వీటితో పాటు హెచ్‌ఎండీఏ (HMDA) జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా కే. చంద్రకళకు ఎఫ్‌ఏసీ (FAC) బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 

©️ VIL Media Pvt Ltd.