Reading Time: 2 minutes

పేరెంట్స్ అలర్ట్..మీ పిల్లల్ని డేకేర్ సెంటర్ లో వదులుతున్నారా.. చూడండి ఎంత ఘోరం జరిగిందో

Caption of Image.

చాలామంది వర్కింగ్ కపుల్స్(ఉద్యోగం చేసే భార్యభర్తలు) తమ పిల్లలను డేకేర్ సెంటర్ లో వదిలివెళ్తుంటారు..  ఉద్యోగం అయిపోయి ఇంటికి వచ్చే వరకు దాదాపు 10 గంటల పాటు పిల్లలను డేకేర్ సెంటర్ నిర్వాహకులకు అప్పజెప్పి వారి ఆలనపాలన  చూసుకోమని నెలకు ఇంత అని డబ్బులు చెల్లిస్తుంటారు.. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి  బిజీ నగరాల్లో  హైఫ్రొఫైల్ డేకేర్ సెంటర్లు బోలెడన్ని సర్వీస్ అందిస్తున్నాయి. అయితే వాటిలో తమ పిల్లలను వదిలి వెళ్తే భద్రత ఎంత అనేది  ఇప్పుడు చర్చకు వచ్చిన అంశం. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లోని ఓ హైఫ్రొఫైల్ సెంటర్ లో  ఓపిల్లాడు  తీవ్రంగా గాయపడితే మేనేజ్ మెంట్ లంచం ఆఫర్ ఇవ్వడం నెట్టింట చర్చనీయాంశమైంది.

మహరాష్ట్ర లోని శంభాజీ నగర్ లోని ఓ ప్రైవేట్ డేకేర్‌ సెంటర్ లో సిబ్బంది ఒక చిన్నారిని గదిలో బంధించి, గమనించకుండా వదిలేయడంతో ఆ చిన్నారి 23 నెలల బాలుడిని 25 సార్లు కొరికినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ ఘటన జూన్ 22న జరిగింది. ఓ లాయర్  తన బిడ్డను డేకేర్ దించి వెళ్లిన తర్వాత ఇది జరిగింది. ఆ వీడియోలో డేకర్ కేర్ టేకర్ నలుగురు చిన్నారులతో కలిసి  ఓ గదిలో ఉన్నట్లు కనిపిస్తుంది.  అరగంట తర్వాత పిల్లల్లోఒకరు గదినుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేయగా..కేర్ టేకర్ అతన్ని ఆపడం కనిపించినప్పటికీ, ఆమె వెంటనే ఆ బిడ్డతో గది నుండి బయటకు వెళ్లి, మిగిలిన ముగ్గురు అబ్బాయిలను లోపలో ఉంచింది.  

ఆ తర్వాత గదిలో టీచర గానీ, కేర్ టేకర్ గానీ ఎవరూ లేకపోవడంతో పిల్లలు భయంతో ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో అబ్బాయిలో ఒకడు మరొక పిల్లవాడిని నోటితో కొరకడం ప్రారంభించాడు. మూడో వాడు భయంతో వణికిపోతూ ఓ మూలన నిల్చున్నాడు. 15 నిమిషాల వ్యవధిలో బాధిత అబ్బాయిని 25సార్లు నోటితో శరీరమంతా కొరికినట్లు సీసీటీవీ ఫుటేజీ లో కనిపించింది.  

►ALSO READ | కరెంట్ బిల్లు తెచ్చిన తంటా.. ఒకే ఒక్క ఫ్లాట్ లో 309 కొండచిలువలు! బాబోయ్ పాముల సామ్రాజ్యం…

ఆతర్వాత 45 నిమిషాల పాటు ఆ గదిలోని ఎవరూ రాలేదు.. దీంతో బాలుడు బాధతో ఏడుస్తూ  గిలగిల కొట్టుకున్నాడు. ఆ సమయంలో టీచర్ గానీ, కేర్ టేకర్ గానీ ఆ రూంవైపుచూడలేదు.బాలుడి ముఖం, ముక్కు, పెదవులు, ఛాతీ, వీపు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంత జరిగినా పేరెంట్స్ కు సమాచారం ఇవ్వలేదు డేకేర్  సెంటర్ నిర్వాహకులు. 

  మధ్యాహ్నం బాలుడిని పికప్  చేసుకునేందుకు వచ్చిన పేరెంట్ కు  బాలుడికి స్వల్ప గాయాలయ్యాయని చావు కబురు చల్లగా చెప్పారు. అయితే అనుమానం వచ్చిన తల్లి.. పిల్లవాడి బట్టలు విప్పిచూడగా షాక్ కు గురైంది. ఒళ్లంతా గాయాలే ఉండటంతో మేనేజ్ మెంట్ పై కేసు పెట్టింది. 

ఇదిలా ఉండే కేసునుంచి విత్ డ్రా చేసుకోవాలని డేకేర్ సెంటర్ నిర్వాహకులు బాధిత  బాలుడి పేరెంట్స్ కు లంచం ఆఫర్ ఇవ్వడం పెద్ద చర్చకు దారి తీసింది. మీరు కేసు  విత్ డ్రా చేసుకుంటే పది లక్షలు ఇస్తామని ఆశ చూపారు మేనేజ్ మెంట్.. ఈ ఘటనలో కొసమెరుపు ఏంటంటే.. ఇప్పటివరకు డేకేర్ సెంటర్ పై ఎలాంటి కేసు నమోదు కాకపోవడమే. 

©️ VIL Media Pvt Ltd.