Reading Time: < 1 minute

వంటింట్లో మీ వంట పని తేలిక చేసే స్మార్ట్ కిచెన్ టిప్స్.. మీకోసమే..

Caption of Image.

రోజూ వంట చేయడం ఒక ఎత్తైతే, ఆ వంట రుచిగా, చూడగానే నోరూరుంచేలా చేయడం ఇంకొక ఎత్తు. ఒక్కోసారి ఎంత బాగా చేసినా అన్నం మెత్తగా అయిపోవడమో, పకోడీలు మెత్తబడడమో జరుగుతుంటుంది. కానీ, వంట గదిలో కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు… శ్రమ తగ్గడమే కాకుండా, వంటల రుచి, రంగు రెట్టింపు అవుతాయి.

పెద్దవాళ్లు చెప్పిన కొన్ని సాంప్రదాయక చిట్కాలతో పాటు, స్మార్ట్ గా వంట  చేసేందుకు పనికొచ్చే కొన్ని సూపర్ కిచెన్ టిప్స్ మీ కోసం…  ఇవి మీ వంటను మరింత పర్ఫెక్ట్ గా మార్చేస్తాయి….

*ఆలుగడ్డలు ఉడికించే నీళ్లలో ఉప్పు వేస్తే పొట్టు తేలిగ్గా వస్తుంది.

*పచ్చి బఠాణీలు రంగు నచ్చనివాళ్లు.. వాటిని ఉడికించేటప్పుడు కొద్దిగా చక్కెర వేస్తే రంగు మారతాయి.

*నూడుల్స్, పాస్తాల్ని ఉడికించాక కాసేపు చల్లటి నీళ్లలో ఉంచితే అతుక్కోవు.

*పకోడీలు కరకరలాడాలంటే శెనగపిండి లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలపాలి.

*మసాలాలు మంచి రంగులో, టేస్టీగా ఉండాలంటే.. మసాలా దినుసుల్ని సన్నని మంటపై వేగించి, మిక్సీ పట్టాలి.

*అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ లలో ఒక టీ స్పూన్ వేడి నూనె వేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.

*అన్నం పొడిపొడిగా కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్ నూనె వేసి ఉడికించాలి.

*ఉప్పు నీళ్లలో ఆలుగడ్డల్ని ఇరవై నిమిషాలు నానబెడితే.. త్వరగా ఉడుకుతాయి.
 

©️ VIL Media Pvt Ltd.