Reading Time: 2 minutes
Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది ఖుష్బూ సుందర్. ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. తాజాగా ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్ తో ఓ రిసార్టులో ఈ వేడుకను నిర్వహించారు. అవంతిక వివాహనికి సినీ , రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులతోపాటు.. నాగార్జున అమల, వెంకటేష్ నీరజ, నాగచైతన్య శోభితా ఈ వేడుకలో సందడి చేశారు. అంతేకాదు.. వివాహ వేడుక జరుగుతన్నంతసేపు వెంకీ, చిరు, నాగార్జున దంపతులు ఒకే వరుసలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నారు. చాలా కాలం తర్వాత అందరూ హీరోలను ఒకే ఫ్రేములో చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

అయితే ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ముగ్గురు సాంప్రదాయ దుస్తులలో సందడి చేశారు. అలాగే ఈ వేడుకలో చిరు పక్కనే త్రిష కూర్చొవడం.. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటున్న వీడియోస్ సైతం వైరల్ గా మారాయి. ఈ వేడుకలో త్రిష సైతం సాంప్రదాయ చీరకట్టులో ఎంతో అందంగా కనిపించింది. మరో వీడియోలో చిరు భుజాన్ని వెంకీ ఫన్నీగా కోరుకుతూ కనిపించారు. మరోవైపు బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఈవేడుకలో కనిపించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

ఖుష్బూ సినిమాల విషయానికి వస్తే.. వెంకటేష్ సరసన కలియుగ పాండవులు సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఖుష్బూ. ఆ తర్వాత నాగార్జున జోడిగా కెప్టెన్ నాగార్జున చిత్రంలో నటించింది. చిరంజీవికి చెల్లిగా స్టాలిన్ మూవీలో మెరిసింది. సౌత్ ఇండస్ట్రీలో అగ్ర తారగా వెలిగిన ఖుష్బూ.. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

ఖుష్బూ కూతురు పెళ్లి వీడియోస్..

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..