
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో రోజులు గడిచే కొద్దీ ఊహించని విషయాలు బయటకు వస్తున్నాయి. నిశ్చితార్థం తర్వాత కాబోయే భర్తను చంపిన సియా గోయల్.. విచారణలో ఆమె చెబుతున్న విషయాలతో పోలీసులు అవాక్కవుతున్నారు.
పెళ్లికి ముందే కేతన్ అగర్వాల్ ను చంపాలని నిర్ణయించుకున్నాం అని.. కేతన్ నచ్చకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయని.. అందులో అతని బట్టతల ఒకటి అని.. కేతన్ పెట్టుకునే విగ్గు కూడా నచ్చలేదని సియాగోయల్ చెప్పిందంట. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించటం ఇప్పుడు సంచలంగా మారింది. కేతన్ విగ్గు విషయంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
బట్టతల ఉందని.. విగ్గు నచ్చలేదని ఏకంగా కాబోయే భర్తను చంపడం కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే. కానీ విగ్గు నచ్చకపోవడంతో చంపేయడమనేదే షాకింగ్ కు గురిచేసే అంశం. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. కేతన్ విగ్గు పెట్టుకున్నది నిజమే.. విగ్గు పెట్టుకోవడం నచ్చలేదని.. పెట్టుకున్న విగ్గు కూడా నచ్చలేదని మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ లేదని అన్నారు. అది కూడా ఒక కారణమై ఉండొచ్చు.. విచారణలో చెప్పినట్లు తెలుస్తుందని ఆయన హింట్ ఇచ్చారు.
►ALSO READ | పెళ్లి కాకుండా లవర్తో ఉంటానన్న పెద్ద కూతురు : వద్దన్న నాన్న, అమ్మ, చెల్లిని చంపేసింది !
అయితే కేతన్ అగర్వాల్ హత్య కేసులో .. సియా గోయల్ ప్రియుడు చేతన్ చౌదరి ప్రోత్సాహం కీలకంగా మారినట్లు చెబుతున్నారు. వారిద్దరూ కలిసి కుట్ర పన్ని, జూన్ 18న లోహగడ్ కోట పైనుంచి అతడిని తోసి చంపిన విషయం తెలిసిందే. సియా గోయల్ కు చంపాలని ప్లాన్ ఇచ్చింది కూడా చేతన్ చౌదరీనేనని వెల్లడైనట్లు తెలిపారు. ఈ కేసులో సియా గోయల్ సోదరుడిని కూడా విచారిస్తున్నారు పోలీసులు.
రిలేషన్ షిప్ లో ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరి.. అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా విగ్గు అంశాన్ని చెప్పి గోయల్ ను మరింత రెచ్చగొట్టాడు చౌదరి. ప్లాన్ ప్రకారం.. గురువారం (జూన్ 19) క్లిఫ్ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత గోయల్, చౌదరికి సిగ్నల్ ఇచ్చింది. ప్లాన్ ప్రకారం అగర్వాల్‌ను తోసివేసి చంపేశారని పోలీసులు చెప్పారు.
అయితే జూన్ 18న లోహగఢ్ కోటకు వెళ్లడానికి తన కూతురు సిద్ధంగా లేదని సియా గోయల్ తల్లి చెప్పారు. కేతన్ అగర్వాల్, తను కలిసి ఆమెను ఒప్పించినట్లు చెప్పారు. జూన్ 17వ తేదీ సాయంత్రం, సియా, కేతన్‌ల ఒక వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. అందులో కేతన్ సియాను తనతో పాటు లోహగఢ్‌కు రమ్మని అడిగాడు. ఆ కాల్ సమయంలో, కేతన్ తల్లి కూడా సియాతో మాట్లాడి, కేతన్‌తో పాటు వెళ్ళమని కోరింది. దానికి సియా, తనకు మరుసటి రోజు ఒక కార్యక్రమం ఉందని, రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది.
పెళ్లి ఖర్చుల గురించి కూడా మీడియాలో వస్తున్న వార్తలపై సియా గోయల్ తండ్రి క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ 3 కోట్ల రూపాయలకు మించలేదని చెప్పారు. తమ కుటుంబం పెళ్లి కోసం ఉదయ్‌పూర్‌లో ఒక ప్యాలెస్‌ను బుక్ చేసుకున్నది నిజమేనని చెప్పారు. అయితే తమ కూతురు చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసుకుందని వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. పెళ్లి ఉదయ్‌పూర్‌లో జరగాల్సింది నిజమే. హోటల్ అద్దె సుమారు రూ. 81, వేల రూపాయలు అయితే మేము 70 రూమ్ లను బుక్ చేశాము. పెళ్లికి మా మొత్తం ఖర్చు రూ. 3 కోట్లకు మించలేదని ఆయన చెప్పారు.