Reading Time: < 1 minute
Viral Video Up Constable Suspended After Cctv Footage From Police Station Goes Viral

Viral Video: ఉత్తరప్రదేశ్‌ లోని జాలౌన్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒరై పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బందికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.

వైరల్ అయిన వీడియోలో ఓ పురుష కానిస్టేబుల్ కంప్యూటర్ వద్ద కూర్చుని పని చేస్తున్న సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ అతని వద్దకు వచ్చి ముద్దు పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై స్పందించిన జాలౌన్ పోలీసులు, వీడియోను పరిశీలించిన అనంతరం కానిస్టేబుల్ అరవింద్ పటేల్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలని సిటీ సబ్ డివిజనల్ అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అరవింద్ పటేల్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 2018 బ్యాచ్ కానిస్టేబుల్. ప్రస్తుతం ఆయన క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి విధుల్లో భాగంగా ఆయన కంట్రోల్ రూమ్‌లో కంప్యూటర్‌పై పని చేస్తుండగా ఈ ఘటన చేసుకుంది. అదే సమయంలో శిక్షణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ కంట్రోల్ రూమ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసు శాఖ అంతర్గత విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యాక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.