Reading Time: < 1 minute

కరప్షన్పోస్టుమాస్టర్: గ్రామస్థులు మహిళకు సాయం చేశారు.. దాతల సొమ్మును బొక్కిండు..!

Caption of Image.
  • దాతలిచ్చిన  డబ్బు పోస్ట్‌‌‌‌మాస్టర్ కాజేసిండు..
  • ఖాతాదారుకు తెలియకుండా రూ.2 లక్షలు డ్రా

కొత్తగూడ, వెలుగు: పోస్ట్ ఆఫీస్‌‌‌‌లో దాచుకున్న సొమ్మును పోస్ట్‌‌‌‌మాస్టర్ ఖాతాదారుకు తెలియకుండా కాజేశాడు. మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడలోని బూరుగుంపునకు చెందిన ఎంపల్లి సందీప్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన భార్య రచన, నెలల వయస్సున్న చిన్నపాప పరిస్థితిని చూసి పలువురు దాతలు ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బును రచన పోస్ట్ ఆఫీస్‌‌‌‌లోని తన ఖాతాలో జమ చేసింది. అయితే గతేడాది డిసెంబర్ 27న అప్పటి పోస్ట్‌‌‌‌మాస్టర్ రమేశ్ ఖాతాదారుకు తెలియకుండా ఆమె ఖాతా నుంచి రూ.2 లక్షలు డ్రా చేసినట్లు తెలిసింది. 

అనంతరం అతను ఇక్కడి నుంచి బదిలీపై వరంగల్‌‌‌‌కు వెళ్లిపోయాడు.  రెండు రోజుల క్రితం డబ్బులు తీసుకోవడానికి రచన పోస్టాఫీస్​కు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవని పోస్ట్​మాస్టర్​ చెప్పాడు. ఆరా తీయగా గత పోస్ట్​మాస్టర్​ రమేశ్​ ఆ డబ్బులు కాజేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న రమేశ్​ బాధితురాలితో రాజీకి యత్నిస్తున్నట్లు సమాచారం.
 

©️ VIL Media Pvt Ltd.