జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.
కేతువును ఎప్పుడు అందరూ తిట్టుకుంటూనే ఉంటారు. అయితే, కొన్నిసార్లు ఈ కేతువు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈయన ఒకసారి అనుగ్రహిస్తే చాలు జీవితం మొత్తం మారుతుంది. ఇంకా మరికొందరికి బాగా కలిసి వస్తుంది. కేతువు, శుక్రుడు కలవడం వల్ల యోగం ఏర్పడబోతోంది. ఇంకా ఈ యోగం వల్ల రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది.
తులా రాశి : తులా రాశి వారికి ఎన్ని బాధలు వచ్చినా దైవ బలం తోడుగా ఉంటుంది. ఏ దుష్ట శక్తులు మిమ్మల్ని ఏం చేయలేవు. మీరు అధైర్య పడకండి. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి సంతోషంగా ఉంటారు. దీని వలన మీరు సంతోషంగా ఉంటారు. ఇంకా అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తారు. కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఈ సమయం మొత్తం మీకు అనుకూలంగా మారుతుంది
వృషభ రాశి: ఈ రాశి వారి జీవితంలో కొత్త మలుపులు వస్తుంటాయి. మీరు చేసే పనుల్లో మీ ఇంటి సభ్యుల సపోర్ట్ కూడా ఉంటుంది. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. మొదలు పెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. పెద్ద పెద్ద అవకాశాలతో జీవితం మొత్తం మారుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా పోతాయి. అప్పులు కూడా క్లియర్ అవుతాయి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




