Reading Time: 2 minutes

అమ్మగా.. క్రికెటర్‌గా.. రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా ICC కొత్త పాలసీ

Caption of Image.

Motherhood And Cricket Can Coexist: మహిళా క్రికెటర్ల కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసింది. డెలీవరి తర్వాత మహిళా క్రికెటర్లు మళ్లీ మైదానంలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు వీలుగా రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్ ను లాంచ్ చేసింది. మాతృత్వం, క్రికెట్ అనేవి వేర్వేరు కాదు.. రెండూ కలిసే కొనసాగవచ్చు అనే మెసేజ్‌తో ఈ సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. మహిళా క్రికెట్ ప్రొఫెషనల్‌గా మారుతుండటంతో.. వారి సంక్షేమాన్ని, ఆటను బ్యాలెన్స్ చేయడానికి ఐసీసీ ఈ స్టెప్ వేసింది. గర్భధారణకు సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా ప్లేయర్ల వ్యక్తిగతం, క్రికెట్ బోర్డులు ఎలాంటి ప్రెగ్నెన్సీ టెస్టులు తప్పనిసరి చేయొద్దని ఐసీసీ క్లియర్‌గా చెప్పింది.

6 Rs మాస్టర్ ప్లాన్: 

మహిళా క్రికెటర్లు ప్రసవం తర్వాత గ్రౌండ్‌లోకి అడుగు పెట్టేందుకు ఐసీసీ అద్భుతమైన 6 Rs ఫ్రేమ్‌వర్క్‌ను సెట్ చేసింది. ప్రసవం జరిగిన మొదటి 6 వారాల్లో రెడీ (Ready) దశతో మొదలు పెట్టి తేలికపాటి కదలికలు, సైకలాజికల్ సపోర్ట్ అందిస్తారు. ఆ తర్వాత 6-8 వారాల్లో రివ్యూ దశలో మెడికల్ స్పెషలిస్ట్లు వారి రికవరీని అసెస్ చేస్తారు. 8-16 వారాల్లో రీస్టోర్ ద్వారా రన్నింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత రీకండిషన్ దశలో గాయాల బారిన పడకుండా బాడీని రీబిల్డ్ చేస్తారు. చివరిగా రిటర్న్, రిఫైన్ దశల ద్వారా ప్లేయర్లు మళ్లీ కాంపిటేటివ్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. 

బేబీ కేర్‌తో ట్రావెల్: 

కేవలం ఫిజికల్ రికవరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్ సపోర్ట్ సిస్టమ్స్ కోసం ఐసీసీ అదిరిపోయే ఆఫర్స్ తీసుకొచ్చింది. ప్లేయర్లకు ఫ్లెక్సిబుల్ ట్రైనింగ్ ఎన్విరాన్‌మెంట్, చైల్డ్ కేర్, బ్రెస్ట్ ఫీడింగ్ సౌకర్యాలతో పాటు విదేశీ టూర్ల సమయంలో కేర్‌టేకర్‌ను కూడా తమతో పాటు తీసుకెళ్లే క్రేజీ ఆప్షన్ ఇచ్చింది. గర్భధారణ సమయంలో ఆడలేని ప్లేయర్లకు కోచింగ్ లేదా అనలిస్ట్ లాంటి ఆల్టర్నేటివ్ రోల్స్ ఇవ్వాలని, అలాగే రికవరీ పీరియడ్‌లో కాంట్రాక్ట్ ఎక్స్‌టెన్షన్స్ కూడా పరిశీలించాలని ఆయా బోర్డులకు ఐసీసీ సూచించింది. ఈ సమయంలో ప్లేయర్లు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా మెడికల్, కోచింగ్ స్టాఫ్‌తో రెగ్యులర్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని తెలిపింది. 

మైదానంలో రచ్చ లేపిన సూపర్ మామ్స్: 

ఇప్పటికే ఎంతో మంది మహిళా క్రికెటర్లు అమ్మలుగా ప్రమోషన్ పొందాక కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సత్తా చాటి హిస్టరీ క్రియేట్ చేశారు. పాకిస్తాన్ స్టార్ బిస్మా మారూఫ్ ప్రెగ్నెన్సీ బ్రేక్ తర్వాత 2022లో తిరిగొచ్చి ఉమెన్స్ వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా చెలరేగిపోయింది. న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్త్‌వైట్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది తల్లులకు స్ఫూర్తిగా నిలిచింది. 

ALSO READ : ఓడియమ్మా.. ఇవేం సిక్సులు భయ్యా..

ఆస్ట్రేలియాకు చెందిన సారా ఇలియట్ తల్లయ్యాక కూడా యాషెస్ సిరీస్‌లో సెంచరీతో చెలరేగింది. ఇంగ్లాండ్ లెజెండ్ ఎనిడ్ బేక్‌వెల్ మాతృత్వం తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇవ్వగా.. వెస్టిండీస్ ప్లేయర్ ఆఫీ ఫ్లెచర్ వికెట్ తీసిన ప్రతిసారీ తన కొడుకు కోసం స్పెషల్ సెలబ్రేషన్స్ చేసేది.. మన ఇండియా నుంచి స్నేహ దీప్తి, కువైట్ నుంచి మరియం ఒమర్ కూడా తల్లైన తర్వాత గ్రౌండ్‌లోకి అడుగుపెట్టి సత్తా చాటారు. మహిళా క్రికెటర్ల కెరీర్‌ను మరింత సస్టైనబుల్‌గా మార్చడంలో ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా గేమ్ ఛేంజర్. 
 

©️ VIL Media Pvt Ltd.