Reading Time: 2 minutes

బ్రిటన్ నెక్ట్స్ PM  రేసులో ఆండీ బర్న్‌హామ్.. ఇంతకీ ఎవరీయన..?

Caption of Image.

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి కీర్ స్టార్మర్ ఉన్నఫలంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రపంచదేశాలను కుదిపేసిన ఎఫ్‎స్టీన్ ఫైల్స్‎లో ఆయన పేరు వెలుగులోకి రావడంతో పాటు ఇతర కారణాలతో స్టార్మర్ పదవి నుంచి వైదొలిగారు. స్టార్మర్ రాజీనామాతో ఆయన వారసుడి కోసం అన్వేషణ మొదలైంది. కౌన్ బనేగా నెక్ట్స్ బిట్రన్ పీఎం అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో గత వారం జరిగిన బ్రిటన్ పార్లమెంటరీ ఉప ఎన్నికలో గెలిచిన గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ అంతర్జాతీయ మీడియాలో మారుమోగిపోతుంది. బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులో ‘కింగ్ ఆఫ్ ది నార్త్’గా పేరుగాంచిన లేబర్ పార్టీ నాయకుడు ఆండీ బర్న్‌హామ్ ముందు వరుసలో ఉన్నట్లు జోరుగా కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరీ ఆండీ బర్న్‌హామ్ అనే చర్చ సాగుతోంది. 

ఎవరీ ఆండ్రూ బర్న్‌హామ్‌..?

ఆండ్రూ ముర్రే బర్న్‌హామ్ 1970 జనవరిలో వాయువ్య ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్‌లో జన్మించాడు. ఒక సాధారణ పరిశోధకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. దేశ క్యాబినెట్ మంత్రిగా, గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా.. ఆ తర్వాత దేశ ప్రధాని రేసులో నిలిచే స్థాయికి ఎదిగారు. బర్న్‌హామ్ మొదటిసారి 2001లో లేబర్ పార్టీ తరపున ‘లీ’ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 

బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, గోర్డాన్ బ్రౌన్ ప్రభుత్వాలలో ట్రెజరీ చీఫ్ సెక్రటరీ, క్రీడా, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తద్వారా లేబర్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన బర్న్‎హామ్ ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి కావడానికి రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 2010, 2015లో లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. దీంతో జాతీయ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి తన సొంత ప్రాంతమైన నార్త్ ఇంగ్లాండ్ పాలిటిక్స్‎పై దృష్టి సారించాడు.

 ఇందులో భాగంగానే 2017లో జరిగిన గ్రేటర్ మాంచెస్టర్ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించి మేయర్‎గా ఎన్నికయ్యారు. తన అద్భుతమైన పనితీరుతో 2021, 2024 గ్రేటర్ మాంచెస్టర్ ఎన్నికల్లోనూ బర్న్‎హామ్ విజయఢంకా మోగించారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహ్మమారి సమయంలో ఉత్తర ఇంగ్లాండ్ ప్రాంత ప్రజ కోసం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడి ‘కింగ్ ఆఫ్ ది నార్త్’ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. 

►ALSO READ | నీళ్ల కోసం యుద్ధానికి సిద్ధం.. భారతదేశాన్ని హెచ్చరించిన పాక్ రక్షణ మంత్రి

ఈ క్రమంలో బర్న్‎హామ్ మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రధాని కావాలని  డిసైడయ్యారు. అయితే, బ్రిటన్ ప్రధాని కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. దీంతో 2026, జూన్ 19 గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ పదవికి రాజీనామా చేసి ఇటీవల జరిగిన మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికల్లో లేబర్ పార్టీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికలో 55 శాతం ఓట్లతో ఘన విజయం సాధించి మళ్లీ పార్లమెంట్‎లో అడుగుపెట్టారు. 

ఇదే సమయంలో బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా చేయడంతో బర్న్‎హామ్ తన చిరకాల వాంఛ అయినా ప్రధాని పదవిపై కన్నేశారు. లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి రేసులో ఆయన ముందు వరుసలో ఉన్నారు. పార్టీలో కూడా ఆయనకు బలమైన మద్దతు ఉందని.. బ్రిటన్ తదుపరి ప్రధానిగా బెర్న్ హామ్ పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.