Reading Time: < 1 minute

పోక్సో కేసులో బండి సంజయ్ ఫొటోలు, వీడియోల వాడొద్దు.. సిటీ సివిల్ కోర్టు ఆదేశం

Caption of Image.

హైదరాబాద్ : తన కొడుకు బండి భగీరథ్ కేసులో  కేంద్రమంత్రి బండి సంజయ్ ఫొటోలు, వీడియోలు వాడొద్దని  సిటీ సివిల్ కోర్డు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్ కేసులో తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో వాడుతూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని  వెంటనే  ఫొటోలు, వీడియోలను తొలగించేలా  ఆదేశాలు జారీ చేయాలని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు బండి సంజయ్. విచారణ చేపట్టిన కోర్టు.. ఈ కేసులో బండి సంజయ్ ఫొటోలు,వీడియోలు వాడొద్దని, అలా వాడితే మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.   

తన కొడుకు బండి భగీరథ్ కేసులో తన పేరు,  ఫొటోలు, వీడియోలు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని శుక్రవారం  (మే15) హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.  తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రచారం జరుగుతోందని తన పేరుతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో ఉన్న వీడియోలను తొలగించాలని కోర్టును కోరారు. మంత్రి బండి సంజయ్ పిటిషన్ విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. 

బండి భగీరథ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును వాడొద్దంటూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేసి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు..​బండి భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోలను డిలీట్ చేయాలని, అలా చేయకుంటే అలాంటి మీడియాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

©️ VIL Media Pvt Ltd.