July 8, 2026

సింగూరులో 50 రోజులకు సరిపోయే నీళ్లే ఉన్నయ్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

సింగూరులో 50 రోజులకు సరిపోయే నీళ్లే ఉన్నయ్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి
Reading Time: < 1 minute

సింగూరులో 50 రోజులకు సరిపోయే నీళ్లే ఉన్నయ్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

Caption of Image.
  • అధికారులకు వాటర్​ బోర్డు ఎండీ ఆదేశం

హైదరాబాద్​సిటీ, వెలుగు: క్యూర్​పరిధిలోకి విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పక్కా ప్లాన్​తో ముందుకు పోవాలని వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వాటర్​బోర్డు హెడ్డాఫీసులో జేఎండీ మయాంక్ మిట్టల్, మూడు రీజియన్ల ఈడీలు, డైరెక్టర్లు, ట్రాన్స్‌‌‌‌మిషన్, ఓఅండ్ఎం, రెవెన్యూ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, సూచనలు చేశారు. 

వచ్చే రెండేండ్లల్లో ఉస్మాన్ సాగర్ లో గోదావరి నీటి నిల్వ చేయడం ద్వారా అదనంగా నీళ్లొస్తాయని, ఆ వాటర్​పంపిణీకి ఇప్పటి నుంచే స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఎక్కువ కెపాసిటీ ఉన్న ట్యాంకర్ల కోసం ప్రత్యేక ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి, వేగంగా నీరు నింపే వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. సింగూరులో 50 రోజులకు మాత్రమే సరిపోయే నీళ్లున్న నేపథ్యంలో, వర్షాలు సకాలంలో కురవని పరిస్థితి ఏర్పడితే నగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. 

తాగునీటి సరఫరాలో ట్యాంకర్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నందున, ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. ట్యాంకర్ నిర్వహణలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, రూల్స్​పాటించకపోవడం చేస్తే అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు. అంతేకాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఈడీలు పంకజ, సామ్రాట్ అశోక్, సంతోష్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, ఆపరేషన్ డైరెక్టర్లు నారాయణ, వాస సత్యనారాయణ పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.