July 8, 2026

Tollywood : శాండిల్ వుడ్ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు ప్రొడక్షన్ హౌసెస్

Tollywood : శాండిల్ వుడ్ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు ప్రొడక్షన్ హౌసెస్
Reading Time: < 1 minute
Telugu Producers Lock Kannada Stars For Mega Budget Films

కన్నడ నిర్మాణ సంస్థలైన హోంబల్, కెవిఎన్ లాంటి కన్నడ ప్రొడక్షన్ హౌస్‌లు మన స్టార్ హీరోలు ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవిలపై కర్చీఫ్స్ వేసి లాక్ చేసిటాలీవుడ్‌లో ఎదిగేందుకు ట్రై చేస్తున్నాయి. అదే దశలో మన ప్రొడక్షన్ హౌస్‌లు శాండిల్ వుడ్ టాప్ హీరోలపై ఫోకస్ చేస్తున్నాయి. టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చందన సీమలో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తోంది. గోల్డెన్ మెగా స్టార్ గణేష్‌తో పినాక, శ్రీ మురళితో మరో ఫిల్మ్ నిర్మిస్తోంది.

రీసెంట్లీ పినాక టీజర్ వదిలారు మేకర్స్. భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నప్పటికీ.. బాహుబలి ఛాయలు కనిపిస్తున్నాయంటూ విమర్శలొస్తున్నాయి. డ్యాన్స్ మాస్టర్ ధనుంజయ ఈ మూవీతో దర్శకుడిగా మారబోతున్నాడు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫిల్మ్. ఇక శ్రీ మురళితో వన్ ఆఫ్ ఇయర్ క్రితం ఓ మూవీని ఎనౌన్స్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కానీ అప్పటి నుండి మరో అప్డేట్ పంచుకోలేదు టీం. కిచ్చా సుదీప్ అప్ కమింగ్ ఫిల్మ్ బిల్లా రంగా భాషాతో శాండిల్ వుడ్ ఎంట్రీ ఇస్తోంది ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్. ఎక్స్ పరిమెంటల్‌గా మూవీగా తెరకెక్కింబోతున్నాడు అనూప్ భండారీ. క్రీశ. 2209లో స్టోరీగా ప్రజెంట్ చేయబోతున్నాడు డైరెక్టర్. వీఎఫ్ఎక్స్ వేరే లెవల్లో ఉండబోతుందని టాక్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు హనుమాన్ నిర్మాతలు. కేజీఎఫ్, కాంతార సిరిస్ చిత్రాల తర్వాత శాండిల్ వుడ్ రేంజ్ మారింది. అక్కడ హీరోలు మంచి వసూళ్లను రాబట్టుకోవడంతో అటు మార్కెట్‌పైనా దృష్టిసారిస్తున్నారు మన మేకర్స్.