Reading Time: < 1 minute

టీసీఎస్ మత మార్పిడి కేసులో.. నిదా ఖాన్ అరెస్ట్

Caption of Image.

ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మతమార్పిడి కేసు ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ఎట్టకేలకు పోలీసుల చిక్కింది. నాసిక్​ టీసీఎస్ ​బ్రాంచిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని బలవంతంగా మత మార్పిడికి ప్రేరేపించారన్న ఆరోపణలపై నిదా ఖాన్‌‌‌‌పై మార్చి 26న కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిదా ఖాన్​ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. 

ఆమె ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు కొత్త వ్యూహాన్ని అమలు చేశారు. నిదా ఖాన్ సోషల్ మీడియా ఖాతాలను, ఆమె సన్నిహితుల ఫోన్ కాల్స్‌‌‌‌ను నిశితంగా గమనించారు. ఆమె ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సాధారణ పౌరుల మాదిరిగా నిఘా పెట్టారు. చివరికి మహారాష్ట్రలోని నరేగావ్​లో నిదాఖాన్​ఉన్న ఇంటిని కచ్చితంగా గుర్తించిన తర్వాత గురువారం రాత్రి పోలీసులు ఆమెను అరెస్ట్​ చేశారు.

©️ VIL Media Pvt Ltd.