Reading Time: < 1 minute

ప్రీ సేల్స్లో పెద్ది రికార్డు.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

Caption of Image.

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్ వైడ్గా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. వందల మిలియన్ వ్యూస్ సాధిస్తూ మూవీపై నెక్స్ట్ లెవల్ బజ్ను క్రియేట్ చేశాయి.

తాజాగా ఓవర్సీస్లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా, కేవలం 4 గంటల్లోనే $1000 ఫ్రీసేల్స్ నార్త్ అమెరికాలో ఆల్టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో   భారీ స్థాయిలో రిలీజ్ చేయనుంది. జూన్ 3న నార్త్ అమెరికా వ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారు.

శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్  సహా పలు దేశాల్లోనూ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ మూవీ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ నెల 16 లేదా 17న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దీని కోసం ఓ మాసివ్ ఈవెంట్ను  ప్లాన్ చేస్తుందట టీమ్. తాజాగా పెద్ది’ సెట్స్ కు చిరంజీవి వెళ్లిన వీడియోను విడుదల చేశారు. రామ్ చరణ్, బుచ్చిబాబు, సుకుమార్ సహా టీమ్ అంతా ఇందులో కనిపిస్తున్నారు. చరణ్ పేహిల్వాన్ లుక్లో ఇంప్రెస్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జాన్వీకపూర్ హీరోయిన్స్ గా నటించగా, శివ రాజ్ కుమార్, జగపతాబు. దివ్యేందు శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సంయుక్త మీనన్ స్పెషల్ సాంగ్లో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.