Reading Time: < 1 minute

పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్: నువ్వా నేనా అన్నట్లు మోదీ, దీదీ

Caption of Image.

కోల్‎కతా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ ముగియడంతో  బెంగాల్‏లో ఏ పార్టీ అధికార పీఠం దక్కించుకుంటుందనే దానిపై పలు సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. రణరంగాన్ని తలపించిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్వల్ప మెజార్టీతో అధికారం చేజిక్కించుకోవచ్చని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఎన్డీఏ కూటమి 150 నుంచి 160 స్థానాలను సాధించి అధికార పీఠానికి చేరువయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 130 నుంచి 140 స్థానాల్లో దక్కించుకోవచ్చని పలు సర్వేలు పేర్కొన్నాయి. 

వెస్ట్ బెంగాల్‎లో మొత్తం అసెంబ్లీ స్థానాలు= 294 
మ్యాజిక్ ఫిగర్= 147 స్థానాలు

P MARQ ఎగ్జిట్ పోల్స్ సర్వే : 

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 118 నుంచి 138 స్థానాలు
బీజేపీ పార్టీ 150 నుంచి 175 స్థానాలు

మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే : 

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 125 నుంచి 140 స్థానాలు
బీజేపీ పార్టీ 146 నుంచి 161 స్థానాలు
ఇతరులు 6 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించే అవకాశం

పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే:

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 178-189 స్థానాలు
బీజేపీ 95 నుంచి 110 స్థానాలు
కాంగ్రెస్ 1 నుంచి 3 స్థానాలు
లెఫ్ట్ పార్టీస్ 0 నుంచి 1

చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే:

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ= 130 నుంచి 140
బీజేపీ= 150 నుంచి 160
ఇతరులు= 6 నుంచి 10 స్థానాలు

జేవీసీ ఎగ్జిట్ పోల్స్ సర్వే: 

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ= 131 నుంచి 152
బీజేపీ= 138 నుంచి 159
కాంగ్రెస్= 2 స్థానాలు
ఇతరులు= 2 స్థానాలు

©️ VIL Media Pvt Ltd.