
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. దక్షిణాదిలో ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జయ జానకి నాయక’ (Jaya Janaki Nayaka) చరిత్ర సృష్టించింది. వరుస అపజయాలతో నిరాశలో ఉన్న బెల్లంకొండకు ఇది జోష్ ను నింపింది.
2017లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎవరూ ఊహించని రేంజ్‌లో ఏకంగా 1 బిలియన్ వ్యూస్ మైలురాయిని అధిగమించి సంచలనం రేపింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘ఖూన్‌ఖార్’ (Khoonkhar) పేరుతో డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. నార్త్ ఇండియా మాస్ ఆడియన్స్‌కు ఈ మూవీ నెక్ట్స్ లెవెల్‌లో కనెక్ట్ అయింది.
దాంతో, యూట్యూబ్‌లో ఒక ఫుల్ లెంత్ ఇండియన్ మూవీకి 100 కోట్ల వీక్షణలు రావడం ఇదే తొలిసారి. సాక్షాత్తూ గ్లోబల్ సెన్సేషన్ ‘KGF: Chapter 1’ హిందీ వెర్షన్ 861 మిలియన్ల వ్యూస్రికార్డును సైతం బెల్లంకొండ బద్దలు కొట్టారు. యూట్యూబ్‌లో రిలీజై దాదాపు ఏడేళ్లు అవుతున్నా ఈ క్రేజ్ తగ్గలేదు. ఇటీవల ఈ సినిమాలోని ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ డైలాగ్ సీక్వెన్స్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో విపరీతంగా వైరల్ కావడంతో, నార్త్ ఆడియన్స్ మళ్లీ ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.
►ALSO READ | Kangana Ranaut: కిస్ సీన్‌లో రక్తం వచ్చేలా హీరో పెదవులు కొరికానా? వైరల్ రూమర్స్‌పై కంగనా షాకింగ్ రియాక్షన్!
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్ విలక్షణ పాత్రలు పోషించారు. థియేటర్లలో ఒక మోస్తారు హిట్‌గా నిలిచిన ‘జయ జానకి నాయక’.. హిందీ డబ్బింగ్ మార్కెట్‌లో మాత్రం బెల్లంకొండను ‘యూట్యూబ్ కింగ్’గా నిలబెట్టింది. ఈ రేర్ ఫీట్‌తో సోషల్ మీడియాలో బెల్లంకొండ పేరు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది